లిప్ లాక్ సమయంలో.. మూడోస్తుందేమో అని భయపడ్డ?
సినిమాలలో మాత్రమే కాదు ఓటిటిలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లో కూడా ఇలాంటి లిప్ లాక్ సీన్లు కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఇలా ముద్దు ముచ్చట కు సంబంధించిన అనుభవాలను ఇటీవలే బాలీవుడ్ యువ హీరోయిన్ కీర్తి కుల్హారి ఒక షోలో చెప్పుకొచ్చింది. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ లో భాగంగా ఈ అమ్మడు మరో మహిళకు లిప్‌లాక్ ఇస్తుంది.. ఇక ఈ లిప్ లాక్ తో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.కానీ ఈ అమ్మడు చెప్పింది విని మరింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు ప్రేక్షకులు. హ్యూమన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది కీర్తి కుల్హారి. ఈ క్రమంలోనే సీనియర్ నటి షాఫాలి షా తో లిప్ లాక్ చేసింది.
ఈ లిప్ లాక్ కు సంబంధించి తన అనుభవాలను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది కీర్తి. షేఫాలి తో లిప్ లాక్ సన్నివేశానికి ముందు ఒకే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. ఒకవేళ నాకు మూడోచ్చేస్తే ఎలా అని అనుకున్నాను.. కానీ మళ్లీ నేను కొంచెం వెనక్కి ఆలోచించి ఏంటి నేను మరో స్త్రీని ఇష్టపడుతున్నానా అంటూ ఆలోచించాను అంటూ తనకు ఎదురైన అనుభవాలను ఇటీవల మీడియాతో పంచుకుంది కీర్తి కుల్హారి. షేఫాలి షా తో లిప్ లాక్ సీన్ పూర్తయిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చు కున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దేవుడి దయవల్ల నాకు ఎలాంటి ఫీలింగ్ రాలేదు అంటూ ఎంతో సంతోషపడ్డా అని ఈ యంగ్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ యంగ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.