ఆ చట్టం.. జగన్‌ను బద్నాం చేయడంలో బాబు ఫుల్‌ సక్సస్‌?

ఏపీలో విపక్షాలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రచారాస్త్రంగా మారింది. ఇటీవల వైసీపీ ఈ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్న విమర్శ ఉంది. ఇప్పుడు ప్రజల ఆస్తులకు సైతం వారి హక్కును ప్రభుత్వమే లాక్కునేలా ఉందని విపక్షాలు ఆరోపించడం మొదలు పెట్టాయి.

టీడీపీ , జనసేనలు చేస్తున్న ప్రచారం సైతం జనంలోకి బలంగా వెళ్లింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు రంగులు వేయడానికి రూ.కొన్ని వందల కోట్లను వెచ్చించడం మనం చూశాం. చివరకు విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాల మీద సైతం రాష్ట్ర ప్రభుత్వ లోగోను తొలగించి.. జగన్ ఫొటోను ముద్రించిన ఘటనలు ఉన్నాయి. అయితే దీనిపై పలు రకాల విమర్శలు ఉన్నాయి. అవినీతి కేసుల్లో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఫొటో పాఠ్యపుస్తకాలపై ముద్రించడం ద్వారా విద్యార్థులకు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అని చంద్రబాబు, పవన్ లు ప్రశ్నించారు.

ఇప్పుడు తాతా ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి పత్రాలు మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద గతంలో ఏ సీఎం కూడా తన ఫొటోను ముద్రించడానికి సాహసించలేదు. అది ప్రజల వ్యక్తిగత ఆస్తి కాబట్టి దానికి సంబంధించిన పత్రాల్లో వారి ఫొటోలనే పొందుపరిచేవారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిగత ఆస్తులపై కూడా జగన్ ఫొటో ముద్రించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

ఈ విషయమై పులివెందులలో సీఎం జగన్ సతీమణి భారతిని తమ ఆస్తులపై జగన్ ఫొటో ఎందుకు అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. దాదాపు ఇది నిలదీసినంత పని జరిగింది. అయితే దీనికి సమాధానం చెప్పకుండానే భారతి అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే ప్రభుత్వం ఇచ్చే వాటిపై సీఎం ఫొటో ఉండటం తప్పేమీ కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: