జనవరి 14 తేదీ అంటే నాగార్జునకు అంత ఇష్టమా...?

murali krishna
స్టార్ హీరో అయిన నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా తొలిరోజే సుమారు 17.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో నాగ్ బాగా సంతోషిస్తున్నారు.
తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా అన్నపూర్ణ స్టూడియోస్ లో బంగార్రాజు సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా జరిగాయట.. ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ జనవరి 14వ తేదీన తన తల్లి అక్కినేని అన్నపూర్ణ పుట్టినరోజు అని చెప్పుకొచ్చారు.నాన్న అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్లే తాను జనవరి 14వ తేదీన బంగార్రాజు సినిమాను విడుదల చేశామని నాగ్ అన్నారట నాన్నగారు నటించిన దసరా బుల్లోడు సినిమా కూడా సంక్రాంతికే విడుదలైందని నాగార్జున కామెంట్లు చేశారట.జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు సినిమాను నిర్మించాయని అందరికి తెలిసిందే.
జీ స్టూడియోస్ తో ఉన్న ఒప్పందం వల్లే నాగార్జున సంక్రాంతి పండుగకు ఈ సినిమాను ఖచ్చితంగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యి సినిమాను విడుదల చేశారని సమాచారం. ఏపీ టికెట్ రేట్ల అంశం గురించి కూడా నాగార్జున గట్టిగానే స్పందించారు. సీఎం జగన్ ను కలవడానికి చిరంజీవి వెళ్లారంటే సమస్యకు హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనని నాగ్ అభిప్రాయపడ్డారట.. సినీ ప్రముఖులు ఆశించిన విధంగానే ఏపీలో టికెట్ రేట్లు ఫిక్స్ అవుతాయో లేదో చూడాలి మరి. ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా ఇతర రాష్ట్రాల స్థాయిలో మాత్రం పెరగడం అసాధ్యమనే కామెంట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. బంగార్రాజు విజయంతో నాగార్జున బాగా సంతోషిస్తున్నారు. 2022 సంవత్సరం కూడా అక్కినేని హీరోలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గతేడాది నాగచైతన్య మరియు అఖిల్ నటించిన సినిమాలు విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: