తస్సాదియ్యా : బాలయ్య నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా ..... ??
అంతకముందు కెరీర్ పరంగా వరుస పరాజయాలతో ఒకింత నిరాశ చెందిన బాలయ్యకి అఖండ విజయం అద్భుతమైన జోష్ ని అందించింది. ఇక అది మాత్రమే కాక మరోవైపు ప్రముఖ ఓటిటి మధ్యమం ఆహాలో అన్ స్టాపబుల్ అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య దాని ద్వారా మరింతగా క్రేజ్ అందుకుంటున్నారు. ఆ షో ఇటీవల ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండిబి వారి నుండి ఇండియాలో పాపులర్ అయిన టాప్ 5 షో గా రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. దానిని బట్టి ఆ షోకి ఎంతటి క్రేజ్, పాపులారిటీ, ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.
ఆ విధంగా అటు వెండితెర పై అటు బుల్లితెరపై బాలయ్య దబిడి దిబిడి అనిపిస్తూ మంచి జోరుతో కొనసాగుతుండడంతో బాలయ్య నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు ఆయనపై సోషల్ మీడియా మాధ్యమాల్లో పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటించనున్నారు. మరి బాలయ్య ఈ సినిమా ద్వారా ఎంతటి విజయాన్ని అందుకోనున్నారో చూడాలి.