లుంగీ కట్టి బాక్సింగ్ చేసిన బాలయ్య.. రౌడీ హీరో షాక్?

praveen
ప్రస్తుతం పూరిజగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో లైగర్ అనే సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు నెలకొన్నాయి. ఇక కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం గమనార్హం. అంతేకాదండోయ్ ఈ మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా కనిపించబోతూ ఉండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడం కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.


 ఇక ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుగుతూ ఉంది. ఇకపోతే లైగర్ చిత్ర బృందం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న unstoppable అనే  కార్యక్రమానికి గెస్ట్ లుగా వచ్చింది. అయితే తన కార్యక్రమానికి ఎవరు గెస్ట్ గా వచ్చిన వారిని ఇమిటేట్  చేయడం.. లేదా వారితో సరదాగా పంచులు వేస్తూ మాట్లాడటం చేస్తూ ఉంటాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే unstoppable స్టేజి మీదికి వచ్చిన పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమా అనుభవాలను గుర్తు చేసుకుని కొన్ని డైలాగులు చెప్పారు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. ఇంకేముంది బాలకృష్ణ ఊరుకుంటాడా లుంగీ పైకి కట్టి ఏకంగా రౌడీ హీరో తో బాక్సింగ్ చేయడానికి రెడీ అయిపోయాడు.


 విజయ్ దేవరకొండ ఎంట్రీ అవ్వగానే కమాన్ అంటూ బాక్సింగ్ చేయడానికి పిలిచాడు నందమూరి బాలకృష్ణ. దీంతో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చివరికి ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత నీకు రౌడీ హీరో అనిపేరు ఎందుకు వచ్చింది అంటూ బాలకృష్ణ అడుగుతాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేయవద్దు అది చేయవద్దు అంటూ ఎంతో మంది చెప్పారు. నేను వాటిని పట్టించుకోలేదు అందుకే రౌడీ హీరో అని పేరు వచ్చింది అంటూ చెబుతాడు విజయ్ దేవరకొండ.. దీనికి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: