అల్లుఅర్జున్ కోసం వెళ్లి.. అడ్డంగా బుక్కైన స్టూడెంట్స్?
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడమే కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది. అయితే డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీల్లో కూడా విడుదలైంది. ఒకవైపు ఓటీటీ లో విడుదలైనప్పటికి ఎంతో మంది ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లి పుష్ప సినిమాను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళనాట కూడా పుష్ప సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలుగులో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ కి తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది.
ఎంతోమంది అభిమానులు అల్లు అర్జున్ సినిమా విడుదలైంది అంటే చాలు థియేటర్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే విడుదలైన పుష్ప సినిమా చూడటానికి వెళ్లిన కొంతమంది విద్యార్థులు అడ్డంగా బుక్కయ్యారు. కడలూరు లోనే ఒక థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లిన స్కూల్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ కి వెళ్తున్నాను అంటే చెప్పి నేరుగా థియేటర్లకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.. ప్రస్తుతం తమిళనాడు 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లు నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక ఇది చెక్ చేయడానికి వచ్చిన అధికారులకు విద్యార్థులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు.