కేజిఎఫ్ హీరో యష్.. అసలు పేరేంటో తెలుసా?

praveen
ఒకప్పుడు కేవలం కోలీవుడ్ హీరో గా మాత్రమే గుర్తింపు సంపాదించి సినిమాలను చేసిన హీరో యష్ కే జి ఎఫ్ సినిమా తో ఇక దేశవ్యాప్తంగా  అందరికీ సుపరిచితుడు గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2018 లో విడుదలైన కేజీఎఫ్ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత ప్రభంజనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. అనుకున్నదాని కంటే భారీ విజయం సాధించడమే కాదు అటు వసూళ్లలో కూడా రికార్డులు సృష్టించింది అని చెప్పాలి. కే జి ఎఫ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అందరి కన్ను కూడా కన్నడ చిత్రసీమ వైపు మళ్ళింది.



 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా అద్భుతమైన  విజయం సాధించడంతో అప్పటివరకు కేవలం కన్నడ స్టార్ హీరోగా మాత్రమే ఉన్న యష్ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. కాగా నేడు మహేష్ పుట్టినరోజు కావడంతో అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన యష్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అయితే ప్రస్తుతం యష్ గా ప్రేక్షకులకు తెలిసిన కన్నడ స్టార్ హీరో అసలు పేరు చాలా తక్కువ మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు.



 1986 జనవరి 8వ తేదీన కర్ణాటక లో జన్మించిన  యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో డ్రైవర్. మైసూరులో చదువును పూర్తి చేసిన ఈ హీరో నటనపై మక్కువ తో అటువైపుగా అడుగులు వేశాడు. ముందుగా బుల్లి తెర హీరో గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరెన్నో టీవీ సీరియల్స్ లో నటించి 2008లో మొగ్గిన మనసు సినిమా తో వెండి తెరపై హీరోగా అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన యష్..  కే జి ఎఫ్ సినిమా తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా యష్ నటించిన కేజిఎఫ్ 2సినిమా విడుదలకు సిద్ధమవుతుందన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: