అయ్యో:హీరో విశాల్ కూడా వెనక్కి తగ్గాడే.. కారణం అదేనా..!!

Divya
కోలీవుడ్ లో మాస్ హీరోగా పేరు పొందారు హీరో విశాల్. ఇక తెలుగులో కూడా తన సినిమాలను విడుదల చేయడానికి ఎటువంటి మొహమాటం లేకుండా ఉంటాడు హీరో విశాల్. ఇక మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్, అజిత్ వంటి హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది హీరో విశాల్ కి. ఇక అక్కడ స్టార్ హీరోలు సైతం సినిమాలతో పోటీపడి విడుదల చేస్తూ ఉంటాడు ఈ హీరో. తెలుగులో కూడా పందెంకోడి వంటి సినిమాతో మంచి ప్రేక్షకాదరణ పొందాడు అని చెప్పవచ్చు. ఇక కథ పరంగా బాగుంటే సినిమా ఏదైనా హిట్ అవుతుందని మనం చెప్పవచ్చు.


తమిళంలో ఆయన నటించిన తాజా చిత్రం  'వీరమే వాగై సూదుమ్.. అనే సినిమాని తెరకెక్కించారు. ఇది కూడా ఒక యాక్షన్ సినిమానే. తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ గా శరవణన్ వహించారు. ఇందులో హీరోయిన్ డింపుల్ హయాతి నటించింది. ఈ సినిమాని తెలుగులో సామాన్యుడు అనే టైటిల్ తో ఈ నెల 14న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేశారు చిత్ర బృందం. విశాల్ కూడా ఈ సినిమానే పండక్కి విడుదల చేయడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ.. తమిళ్ లో థియేటర్లు మూతపడడంతో.. పెద్ద పెద్ద సినిమాలు వాయిదా పడిపోయాయి. ఇక విశాల్ సినిమా కూడా వాయిదా వేయక తప్పలేదు. ఈ సినిమాని తెలుగునాట కూడా వాయిదా వేయడం జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఈనెల 26న విడుదల చేయాలని చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ఇక హీరోయిన్ డింపుల్ హయాతి తెలుగులో పెద్దగా పరిచయం లేదు. కేవలం గద్దల కొండ గణేష్ సినిమాలో ఒక పాటలో మాత్రమే కనిపించింది. ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: