వర్మకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్..

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా తనకు అవసరం లేని విషయాలు గురించి మాట్లాడుతూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తూ వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు ఇంకా అలాగే థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనేక ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.ఇక ఈ మేరకు ఓ వీడియోను కూడా ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టారు. తన ప్రశ్నలకు స్పందించాలని ఏపీ ప్రభుత్వ పెద్దలకు లేదా మంత్రులకు మంగళవారం సాయంత్రం సవాలు విసరడం జరిగింది. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ వదిలిన ప్రశ్నలకు కౌంటర్ ఇస్తూ వరుస పేర్ని నాని ట్వీట్లు చేశారు.


''ఇక హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు మీరు ఒక ఫార్ములా చెప్పారు. ఇక మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? అలాగే ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ  కూడా థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు ఆర్జీవీ గారూ'' అని కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.అలాగే ఇంకో ట్వీట్ లో ''ఇక సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ఇక ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ ఇంకా అత్యవసరంగా గానీ భావించటం లేదు రామ్ గోపాల్ వర్మ గారూ. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 వ సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.''అని రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ వేస్తూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం పేర్ని నాని వర్మకి కౌంటర్ వేస్తూ చేసిన ఈ ట్వీట్ లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



https://twitter.com/T2BLive/status/1478573681852882945?t=9evaOlwMTFgvjqryGZudgQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: