సౌందర్య సెట్స్ లో ఎలా ఉండేవారో తెలుసా .... ??

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటి దివంగత నటి సావిత్రి గురించి మన తెలుగు వారితో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ కి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఆ విధంగా తన అందం, అభినయంతో అన్ని భాషల ఆడియన్స్ నుండి మహానటిగా గొప్ప పేరు అందుకున్నారు సావిత్రి. అనంతరం వచ్చిన అనేకమంది హీరోయిన్లు కూడా బాగానే ఆడియన్స్ నుండి పేరు అందుకున్నప్పటికీ ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో తనదైన అభినయంతో అలరించిన దివంగత నటి సౌందర్యకు మాత్రమే సావిత్రి తరువాత అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు లభించాయి.
తొలి సినిమా 1993లో వచ్చిన మనవరాలి పెళ్లి ద్వారా తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య ఆ తరువాత తన టాలెంట్ తో అనేక అవకాశాలు అందుకుని వాటిని సక్సెస్ లు గా మలుచుకోవడంలో ఎంతో సఫలం అయ్యారు. ఇక అక్కడి నుండి కేవలం తెలుగు మాత్రమే కాక హిందీ సహా అనేక భాషల్లో పలువురు స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించి అందరి నుండి బాగా పేరు అందుకున్నారు సౌందర్య. అయితే విషయం ఏమిటంటే, తన సినిమాల సెట్స్ లో సౌందర్య వ్యవహరించే తీరు నిజంగా అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేదట.
ముఖ్యంగా ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ అనే భేషిజం ఆమెలో ఏ మాత్రం కొసరంత కూడా ఉండేది కాదని, అలానే ఎక్కువగా తనతో పాటు నటించే ప్రతి ఒక్క నటులతో పాటు సెట్స్ లో లైట్ బాయ్ దగ్గరి నుండి డైరెక్టర్ వరకు అందరితో సౌందర్య ఎంతో కలుపుగోలుగా ఉండేవారట. ఇక మధ్యలో భోజనాల సమయంలో అందరితో కలిసి తినడం మాత్రమే కాక, సెట్స్ లోని వారిలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటె తెలుసుకుని వారికి తనవంతుగా ఆమె మంచి మనసుతో సహాయం అందించే వారట. ఆ విధంగా అందరి నుండి ఎంతో గొప్ప పేరు సొంతం చేసుకున్న సౌందర్య 2004లో ఏపీ ఎలక్షన్స్ సమయంలో హఠాత్తుగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం నిజంగా ఆమె కుటుంబానికి, అభిమానులకు మాత్రమే కాదు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు తీరని లోటు అనే చెప్పాలి. అటువంటి మరొక దిగ్గజ నటి ఇప్పటి వరకు రాలేదని, మరి భవిష్యత్తులో మరొక సౌందర్యని చూస్తామా లేదా అనేది తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: