సిరి బాయ్ ఫ్రెండ్ ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ షాక్?
ఒక రకంగా చెప్పాలంటే సిరి షణ్ముఖ్ జస్వంత్ బిగ్బాస్ హౌస్ నుంచి ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని బయటికి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో మితిమీరిన హగ్గులు కిస్సులతో నెగటిటివిటి మూటగట్టుకున్నారు ఈ క్రమంలోనే ఇటీవల షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునైనా ఐదేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ బ్రేకప్ చెప్పేసింది. నేను కలిసి ఉండ లేను అంటూ తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా లవ్ బ్రేకప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో అటు సిరి శ్రీహన్ బ్రేకప్ చెప్పుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో వీరిద్దరూ ఎప్పుడు ఎలాంటి పోస్టులు పెడతారా అని అందరు సోషల్ మీడియాలో ఎప్పుడు వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే జనవరి 3వ తేదీన సిరి బర్త్ డే సందర్భంగా ఆమె ప్రియుడు శ్రీహన్ ఎమోషనల్ పోస్ట్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే సిరి ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్ తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నానునీ లక్ష్యాలను త్వరలోనే తప్పకుండా సాధిస్తావు గాడ్ బ్లెస్స్ యు అంటూ శ్రీహాన్ ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. బిగ్ బాస్ కార్యక్రమంలో కి వెళ్ళిన తర్వాత సిరి పై ఎన్నో రకాలుగా ట్రోల్స్ వచ్చినప్పటికీ ప్రియుడు శ్రీహన్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నాడు.