నాని ఇక కుమ్ముకోవచ్చు.. అలా కలిసొచ్చింది!!
సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని కొంతమంది సినిమా విశ్లేషకులు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వారు చెప్పిన విధంగానే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది. అయితే అందరినీ ఆకట్టుకోలేకపోయినా కొంత మంది ప్రేక్షకులలో మాత్రం ఈ సినిమాకి హిట్ టాక్ ను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. దీనికి ముందు నాని టైం ఏ మాత్రం బాగా లేదనే చెప్పాలి. ఆయన నటించిన రెండు సినిమాలు వరుసగా ఓ టీ టీ లో విడుదల అయ్యాయి. ఆయన స్థాయిని ఇది తగ్గించగా అవి ప్లాప్ అవడం కూడా ఆయన స్థాయి నీ మరింతగా తగ్గించింది అని చెప్పాలి.
అలా ఆ రెండు సినిమాలతో వరుసగా భారీ ఫ్లాప్ల ను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. దాంతో శ్యామ్ సింగ రాయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో అనుమానాలు అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా విజయవంతం అవడం తో నానికి ఊపిరి వచ్చినట్లు అయ్యింది. ఈ సినిమా విజయం అయన కేరీర్ ను కూడా నిలబెట్టింది అని చెప్పవచ్చు. ఏదేమైనా దానికి విజయం అవసరం అయిన సమయంలో ఈ సినిమా హిట్ అవడం అభిమానులను ఎంతగానో సంతోష పరిచింది. దానికి తోడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పోస్ట్పోన్ కావడంతో ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే క్రేజీ సినిమా లేకపోవడంతో నాని వసూళ్ళ పరంగా కూడా తన సత్తా చాటుకున్నాడు.