ఆర్ ఆర్ ఆర్ బాటలో రాధే శ్యామ్!!
అయితే కలెక్షన్స్ ఏమాత్రం తగ్గినా నిర్మాత కు భారీ నష్టం వస్తుంది కాబట్టి చిత్రాన్ని అంతటా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేయడానికి కరెక్ట్ సమయం కాదని భావించి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు యూనిట్. తొందర్లోనే మంచి ముహూర్తం చూసి ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుండడం తో మరికొన్ని సినిమాలు బరినుంచి కూడా తప్పుకున్నాయి.
దాంతో ఈ సినిమా పోస్ట్ పోన్ కావడం అందరినీ నిరాశపరిచింది చెప్పాలి. అయితే సంక్రాంతి కానుకగా రాబోతున్న మరో చిత్రం కూడా విడుదలకు వెళ్లాలా లేదా అన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ లాగానే రాధే శ్యామ్ కూడా పలు భాషలలో విడుదల కాబోతుంది. అన్ని భాషలలో ఒమి క్రాన్ కారణంగా థియేటర్లు మూసివేసి ఉండటంతో ఈ సినిమా విడుదల చేయాలా వద్దా అన్న సందిగ్థంలో ఇప్పుడు చిత్ర యూనిట్ పడింది. ప్రభాస్ దీనివిషయమై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏదేమైనా ఈ మహమ్మారి వల్ల తెలుగు సినిమా పరిశ్రమ కు మరొకసారి భారీ నష్టం తప్పేలా లేదు. ఇది భవిష్యత్తులో ఇది ఇంకెంత తీవ్రరూపం దాల్చుతుంది అనేది చూడాలి.