తెగని ఆర్ ఆర్ ఆర్ లెక్కల పంచాయితీ టెన్షన్ లో రాజమౌళి !
ఎన్ని వ్యతిరేక పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ ను అనుకున్న విధంగా జనవరి 7న విడుదల చేసి తీరాలి అన్న పట్టుదలతో జరుగుతున్న ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు పడితే మరొక అడుగు వెనక్కు పడుతోంది. ఈ పరిస్థితులలో అసలు జనవరి 7న ఏమి జరుగుతుంది అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు పెంపు విషయమై ఇంకా ఎటువంటి సానుకూల సంకేతాలు రావడం లేదు. ఈ విషమై ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు ఒక సమావేశాన్ని జరుపుతోంది. అయితే ఈ సమావేశంలో పాజిటివ్ నిర్ణయం వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి.
దీనితో ఆంధ్రా సీడెడ్ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలతో నిన్న తమ సమస్యలు వివరిస్తూ ఒక సమావేశం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో బయ్యర్లు అంతా తాము గతంలో ఒప్పుకున్న రేట్లలలో 50శాతం తగ్గించమని అడుగుతూ ఉంటే నిర్మాతలు మటుకు 20శాతం తగ్గింపు పై చర్చలు జరిపినట్లు టాక్.
దీనితో ఎటువంటి నిర్ణయం రాకుండానే నిన్నటి సమావేశం ముగిసింది అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ఇక కేవలం 7రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఇలా రకరకాల సమస్యల పై మీటింగ్స్ కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉంటే ‘ఆర్ ఆర్ ఆర్’ పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరొక వైపు రికార్డు స్థాయిలో అమెరికా కెనడా ఫ్రాన్స్ దేశాలలో కరోనా ఒమైక్రాన్ కేసులు పెరిగిపోతు ప్రపంచ వ్యాప్తంగా 24 గంటలలో 16 లక్షల కేసులు 7 వేల మరణాలు ఒక్కరోజులోనే జరిగినట్లు వార్తలు వచ్చిన పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ పరిస్థితి ఏమిటి అంటూ అనేక ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ముంబాయ్ లో కూడ పరిస్థితులు చేయి జారిపోతున్న నేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ పరిస్థితి ఏమిటి అన్నది అర్థంకాని ప్రశ్న..