ఆర్ఆర్ఆర్ : 3 గంటల మూవీలో..... అవి కేవలం 25 నిమిషాలేనా .... ??
ఇక ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై ఎంతో భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ సినిమాకి మరొకవైపు ఇండస్ట్రీ వర్గాల్లో పూర్తిగా పాజిటివ్ బజ్ వినపడుతూ ఉండడంతో పాటు ఇన్నర్ వర్గాల సమాచారం ప్రకారం మూవీ అందరి అంచనాలు అందుకోవడంతో పాటు అంతకు మించేలా ఉంటుందని సమాచారం. అయితే విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ మూవీ మొత్తం రన్ టైం 3 గం. 3 ని.లు కాగా, అందులో 25 నిమిషాల వరకు మాత్రమే డైలాగ్స్ ఉండగా మిగతాదంతా కూడా యాక్షన్, ఎమోషనల్, ఫైట్స్, భాయీ విజువల్స్ ఉంటాయని అంటున్నారు.
బాహుబలి ని మించేలా మరింత అద్భుతంగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం యూనిట్ మొత్తం ఎంతో శ్రమించిందని, ఇక మొదటి భాగం ఒకింత యాక్షన్, ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమా రెండవ భాగం మరింత యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా సాగి అందరినీ ఎంతో ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. మరి ప్రపపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న ఆర్ఆర్ ఆర్ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.