ఈ హిట్స్ మన హీరోలు మర్చిపోలేనివి!!
ఈ ఏడాది ఆరంభంలోనే గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ చిత్రం సూపర్ హిట్ అందుకునీ ఈ ఇద్దరికీ మంచి కం బ్యాక్ వచ్చింది అని చెప్పవచ్చు. అంతకు ముందు రవితేజ భారీ ఫ్లాప్ లలో ఉన్నాడు గోపీచంద్ మలినేని కెరీర్ కూడా ఏమంత ఆశాజనకం గా లేదు. పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమా కంటే ముందు భారీ ఫ్లాప్ ను చవి చూడగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన ఈ వకీల్ సాబ్ సినిమా తో మంచి కం బ్యాక్ చేశాడు.
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా కంటే ముందు హిట్ క కంటే ఆయనకు ఫ్లాప్ లే ఎక్కువగా ఉన్నాయి. ఆయన సినిమా చేస్తే ఫ్లాప్ రాదు అనే నమ్మకాన్ని రుజువు చేస్తూ మళ్లీ అఖండ చిత్రంతో ఘన విజయం సాధించుకొని ఇద్దరు కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు. హీరో గోపీచంద్ కూడా సిటిమార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అంతకుముందు ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకరించలేదు. ఇక శ్రీకాంత్ అడ్డాల మేర్లపాక గాంధీ బొమ్మరిల్లు భాస్కర్ దేవాకట్ట వంటి దర్శకులు ఈ సంవత్సరం మంచి హిట్ అందుకని మళ్లీ ఫామ్లోకి వచ్చారు