రాధేశ్యామ్ కోసం.. నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నాడో తెలుసా?
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. తనదైన మాట తీరుతో అందర్నీ కలుపుకుంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవలే నవీన్ పొలిశెట్టి ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా దర్శనమిచ్చాడు. సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది యాంకర్లకు ఉన్నప్పటికీ హీరో నవీన్ పొలిశెట్టి నే యాంకర్ గా నియమించాలని ఎవరు సలహా ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకరింగ్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
నవీన్ పొలిశెట్టి తెలుగు ప్రేక్షకులకే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. అక్కడా కొన్ని సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి తో యాంకరింగ్ చేయిస్తే సినిమాకు కలిసి వస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ సలహా ఇవ్వడంతో నవీన్ పొలిశెట్టిని పిలిచారట. అయితే గతంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసాడు ప్రభాస్. ఇక ఆరోజు తన సినిమా కు సపోర్ట్ చేసినందుకు గాను ఇక ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా ప్రభాస్ సినిమా అనగానే వెంటనే ఒప్పుకున్నాడట. అయితే వీ రిలీజ్ ఈవెంట్ లో యాంకరింగ్ చేసేందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట నవీన్ పొలిశెట్టి. ఇక ఇది తెలిసి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.