ఇక నవీన్ పోలిశెట్టి ట్రెండ్ మొదలైంది..!!

P.Nishanth Kumar
జాతిరత్నాలు సినిమాతో మర్చిపోలేని హిట్ సంపాదించిన నవీన్ పోలిశెట్టి తదుపరి సినిమా కోసం అయన అభిమానులు ఎన్నో రోజులనుంచి ఎదురుచూశారు. ఎప్పుడెప్పుడు తమ హీరో ని తెరపై మళ్ళీ చూస్తామా అని ఎంతో ఎదురుచూడగా అయన తదుపరి సినిమా అనౌన్సు మెంట్ కూడా లేకపోవడం అయన అభిమానులను ఎంతో నిరాశ పరిచింది. అనుష్క తో కలిసి అయన ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఓ పెద్ద దర్శకుడితో కలిసి అయన ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి.

అంతేకాదు మాస్ సినిమా చేస్తున్నాడని ఇలా చాలా రకాలుగా అయన చేయబోయే తదుపరి సినిమా యొక్క అప్డేట్ లను చేశారు. అలా చాలా పుకార్లు ఇప్పుడు తెలుగునాట హల్చల్ చేయగా చివరకు అయన చేయబోయే తదుపరి సినిమా యొక్క అప్డేట్ బయటకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ను ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా లో అనుష్క ఓ కీలక పాత్ర లో నటిస్తుందని తెలుస్తుంది. ఏ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతుండగా చాలా రోజుల తర్వాత అనుష్క ఓ సినిమాలో నటిస్తుండడం విశేషం. 

ఇదే కాకుండా త్రివిక్రమ్ రచన లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమా తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన ఈ హీరో ఆ తర్వాత ఎంతో ఆచితూచి జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుని ముందుకు వెళతాడు. మరి ఇప్పుడు చేయబోయే సినిమాలు బాగుంటే మాత్రం తప్పకుండ ఆ సినిమాలతో అయన కు భారీ పాపులారిటీ రావడం ఖాయం అని చెప్పొచు. తెలుగు లో యువ హీరో లు రోజు రోజు కు తమ తమ టాలెంట్ నిరుపించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: