జెర్సీ విషయం లో తప్పు చేశాను - హీరో నాని!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అవార్డులు రివార్డులు కూడా దక్కాయి అంటే ఈ సినిమా మా దేశ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనే చెప్పాలి. యుక్త వయసులో ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అయిన ఓ క్రికెటర్ మధ్య వయసులో క్రికెట్ పై పోరాటం సాధించి ఏ విధంగా తన కోరికను నెరవేర్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథ కాగా ఈ సినిమా కథ కు యావత్ భారతావని ఫిదా అయ్యి ఈ చిత్రం ఘనవిజయం అయ్యేలా చేసింది.
హీరో నానికి కూడా ఈ చిత్రం మంచి పేరు తీసుకువచ్చింది. మొదటి నుంచి నాని నాచురల్ గా నటిస్తాడు అనే పేరు ఉంది. అలా హీరో నాని ఈ సినిమాలోనూ ఎంతో నాచురల్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. క్రికెటర్ గా ఆయన తెరపై కనిపించడానికి భారీ కసరత్తులు చేశాడు అని చెప్పవచ్చు. ఎక్కడా కూడా ఓ సినిమా నటుడు క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించలేదు అంటే దీని వెనకాల ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. అలా ఈ సినిమాలో ఆయన నటించిన తీరుకు ప్రేక్షక లోకం దాసోహం అయి ఈ చిత్రానికి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని ఆయన అభిమానులు ఇప్పటికీ చెబుతుండడం విశేషం.
తాజాగా నాని ఈ సినిమా గురించిన ప్రస్తావన తీసుకు వచ్చాడు. ఆయన హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఆయన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో జెర్సీ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జెర్సీ చిత్రాన్ని అప్పుడే పాన్ ఇండియా సినిమాగా చేసి ఉంటే బాగుండేదని కానీ అప్పటికీ పాన్ ఉంద సినిమా చేసే ఉద్దేశం తనకు లేదని తాను కేవలం సౌత్ సినిమా హీరో నీ మాత్రమే అని ఆయన వెల్లడించారు. ఏదేమైనా అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు అని ముందుకు దూసుకుపోతుంటే నాని మాత్రం తెలుగుకు మాత్రమే పరిమితం కావడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.