'పుష్ప' మూవీ అనసూయకు ప్లస్ అయిందా?

VAMSI
బుల్లితెరపై జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన అనసూయ అనతి కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రంగస్థలం సినిమాలో రంగమత్తగా అనసూయ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అసలు ఆ పాత్రకి అను తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరేమో అన్నంతగా తన నటనతో ఆశ్చర్యపరిచారు అనసూయ. ఇక ఆ తరవాత అంతటి డెప్త్ ఉన్న పాత్రలో మళ్ళీ కనిపించలేదనే చెప్పాలి. మళ్ళీ ఇన్నాళ్ళకు పుష్ప సినిమాలో ఆమె పాత్ర గురించి తెలియడంతో అందరి దృష్టి మర్లింది. ఆ పాత్ర ఎలా ఉండబోతుంది, అనసూయ ఏ రేంజ్ లో కనిపించనుంది అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ సినిమాలో అనసూయ పాత్ర హైలెట్ గా ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ తెలుగు ఇండస్ట్రీ లో ఒక సంచలనంగా ఉంటుందని అంతా అనుకున్నారు. అందులోనూ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా అనసూయ పాత్రను చాలా హైలెట్ గా చూపించడంతో అంచనాలు మరింత పెరిగాయి.. అయితే సినిమా రిలీజ్ అయ్యాక...ఆ పాత్రపై ఉన్న అంచనాలకు సరిగ్గా  చేరుకోలేదనే అంటున్నారు. నెగెటివ్ రోల్ లో కనిపించిన అనసూయ పాత్ర గురించి మారు మ్రోగుతుంది అనుకుంటే ఆ పాత్ర గురించి పెద్దగా సడి చప్పుడు లేదు. అనసూయ తన పాత్ర పరిధిమేర నటించారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ ఆమె పాత్రకు సరిహద్దులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పాత్ర పరిధిని దాటడం కష్టమే కదా అని మరికొందరి అభిప్రాయం. కానీ సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టోటల్ గా కలెక్షన్ లను బట్టి మాత్రమే సినిమా ఫలితాన్ని నిర్దారించడం జరుగుతుంది. అయితే అనసూయ కు ఈ సినిమా ప్లస్ అయిందా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఆఫర్స్ ను బట్టి మాత్రమే తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: