బిగ్ బాస్ 5 : శ్రీరామ్ అంత సంపాదించాడా?

praveen
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్  తెలుగు ఐదో సీజన్ ఇటీవల డిసెంబర్ 19వ తేదీన ఘనంగా ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు సమాప్తం అయ్యింది. ఇక ఎన్నో రోజుల నుంచి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్న చర్చ కూడా ఇటీవలే గ్రాండ్ ఫినాలే లో తెర పడింది అనే విషయం తెలిసిందే. బిగ్బాస్ కార్యక్రమం ముగిసింది కానీ బిగ్బాస్ కార్యక్రమం గురించి ప్రేక్షకులు మధ్య చర్చ మాత్రం  ఇంకా ముగియలేదు. సాధారణంగా బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇలా ఎలిమినేట్ అయ్యి ఎవరైనా బయటికి వస్తే వారి గురించి రెండు రోజులపాటు చర్చించుకుంటూ ఉంటారు.



 ముఖ్యంగా వారి పారితోషికం ఎంత అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ ఫైవ్ లో నిలిచిన వారి పారితోషికం ఎంత అనేదానిపై ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని బిగ్ బాస్ కార్యక్రమంలో కి వచ్చినా శ్రీరామ్ తనదైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. టైటిల్ గెలవక పోయినప్పటికీ తాను అనుకున్నట్లుగానే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం గెలుచుకున్నాడు అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో పాటలు పాడి ఎంతోమంది మనసులో చోటు సంపాదించుకున్నాడు.



 ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో 15 వారాలపాటు కొనసాగి ఇక టాప్ త్రీ లో నిలిచిన శ్రీరామ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం శ్రీరామ్ వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇలా ఏకంగా 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకుగాను మొత్తంగా 35 లక్షల వరకు బిగ్బాస్ నిర్వాహకుల నుంచి శ్రీ రామ్ కి ముట్టినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.  ఇకపోతే బిగ్బాస్ ఐదో సీజన్లో టైటిల్ విన్నర్ గా దాన్నినిలిచి 50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: