బిగ్ బాస్ 5 : ప్రోమోలో ఒక ట్విస్ట్.. ఎపిసోడ్ లో మరో ట్విస్ట్?

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ బిగ్బాస్ కార్యక్రమం ఎలా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కార్యక్రమం ఎంతగానో గుర్తింపు సంపాదించుకోవడానికి ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఉండడమే కారణమని చెప్పాలి. బిగ్బాస్ ఆట మొదలైన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎన్నో ట్విస్ట్ లు ఊహించని ఘటన లు కూడా జరుగుతూ ఉంటాయి.. అందుకే అటు బిగ్ బాస్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఎప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటుంది.. ఇక పోతే మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్బాస్ కార్యక్రమంలో ప్రస్తుతం కేవలం ఐదు మంది కంటెస్టెంట్ లు మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ఐదుగురే టాప్ 5 కంటెస్టెంట్ లు  అని అందరికీ తెలిసిపోయింది. ఇక గ్రాండ్ ఫినాలే లో ఒక్కొక్కరిని ఇంటి నుంచి బయటకు తీసుకు వస్తూ చివరికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అన్నది తేలుస్తారు బిగ్బాస్ నిర్వాహకులు. అయితే ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరిని ఎలిమినేషన్  అంటూ బిగ్బాస్ ఇంటినుండి బయటికి తీసుకువచ్చాడు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో వామ్మో ఇదేమి ట్విస్ట్ అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

 ఫుల్ ఎపిసోడ్ లో అసలు ఏం జరుగుతుంది అని ఈ ప్రోమో అందరిలో ఆసక్తిని పెంచుతుంది అని చెప్పాలి. ముందుగా బిగ్బాస్ అందరి సూట్కేసులు  సర్దుకొని బిగ్ బాస్ గేట్  దగ్గరికి రావాలని సూచిస్తాడు. ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని అందరి అభిప్రాయాలను తెలుసుకుంటాడు ఇక చివర్లో సిరి ఎలిమినేట్ అయ్యారవ్ అంటూ చెప్పడంతో షణ్ముఖ్  సిరి ఎంతగానో ఎమోషనల్ అవుతారు. ఇక ఆ తర్వాత సిరి కళ్లకు గంతలు కట్టి ఒక సీక్రెట్  రూమ్ కి పంపిస్తారు. సిరి వెళ్లడంతో బిగ్బాస్ గేటు దగ్గర కూర్చొని ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు షణ్ముక్. ఇక ఇది టీవీలో చూసిన సిరి బిగ్బాస్ వాడు తట్టుకోలేడు నన్ను ఇంట్లో కి పంపించండి వాడు ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేడు ప్లీజ్ బిగ్బాస్ పంపించండి అంటూ సిరి ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది. అయితే సమయం వచ్చినపుడు తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతాము అంటూ బిగ్బాస్ చెబుతాడు ఇక సిరిని బిగ్ బాస్ హౌస్ లోకి సిరిని పంపి మరో ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్.  ఇక సిరి మళ్ళీ ఇంట్లోకి రావడం తో షణ్ముఖ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: