అదే బన్నీ కి ఇంత పెద్ద సక్సెస్ వచ్చేలా చేసింది!!
ఈ నేపథ్యంలోనే వీరి కలయికలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని వీరి అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా పుష్ప అనే చిత్రం మొదలవుతున్న సమయంలోనే అభిమానులలో సంబరాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్ లో పుష్ప చిత్రం రాబోతుందని అప్పుడే డిసైడ్ చేశారు. వారు అనుకున్న విధంగానే ఈ చిత్రం విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తన అభిమానుల కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు గా వారు చెబుతున్నారు.
ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా బన్నీ క్యారెక్టరైజేషన్ ఎంతో గొప్పగా కొత్తగా ఉందని వారు చెబుతున్నారు. ప్రతి ఒక్క బన్నీ అభిమాని కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా ఈ చిత్రం ను సుకుమార్ తెరకెక్కించాడని అంటున్నారు. ఈ చిత్రంలోని పాత్ర పైనే సుకుమార్ ఎక్కువగా దృష్టి పెట్టాడు అని ఆయన పాత్ర తీరుతెన్నులు బట్టి తెలుస్తుంది. అందుకే ఆయన ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాలో ఎక్కడా అల్లు అర్జున్ కనపడడు. పుష్పరాజ్ అనే పాత్ర మాత్రమే అల్లు అర్జున్ రూపం లో కనిపించింది. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి అల్లు అర్జున్ నటన ముఖ్య కారణం అయ్యింది