'పుష్ప' విడుదల.. చరణ్ ఏమన్నాడో తెలుసా?

praveen
టాలీవుడ్ లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ తన స్టైల్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ముచ్చటగా మూడో సారి వీరి కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలైంది.


 దీంతో ఇక ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు అందరూ థియేటర్లకు బారులు తీరుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు అందరికీ కూడా ఈ సినిమా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. అయితే ఇక నేడు పుష్ప సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో నాచురల్ నటనతో పుష్ప రాజ్ ఇరగదీశాడు అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పుష్ప సినిమా విడుదల సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియ జేశాడు.



 బన్నీ పుష్ప సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కోసం మీరు చేసిన కృషి అసాధారణమైనది. సుకుమార్ గారు మీ విజన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక ఈరోజు విడుదలవుతున్న అద్భుతమైన పుష్ప సినిమా కోసం రష్మిక, మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ క్రమంలోనే అటు మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కి పూర్తి స్థాయి మద్దతు అందిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే ప్రదర్శించబడిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటు దూసుకుపోతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ చూస్తే ఇక ఈ సినిమా మరో బ్లాక్బస్టర్ కాబోతుంది అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: