చరణ్ ఏదో చేసేలా ఉన్నాడే.. మామూలోడేం కాదు!!

P.Nishanth Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరస పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేసి ఒక్కసారిగా తోటి హీరోల ను ఎంతో ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమాను పూర్తి చేయగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రస్తుతం హుషారుగా పాల్గొంటున్నారు. జనవరి 7 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. భారీ సినిమాలను తెరకెక్కించడంలో ఆరితేరిన శంకర్ ఇప్పటివరకు చేసిన సినిమాలను కూడా భారీ గా ఉండేలా చూసుకున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్న శంకర్ చరణ్ తో చేస్తున్న సినిమా కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నాడు. అందులోనూ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో దానికి మించిన స్థాయిలో తన సినిమా నీ తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నాడు. అలా చరణ్ రాజమౌళి తర్వాత శంకర్ ను దర్శకుడిగా ఎంచుకోవడంలోనే ఆయన ఈ సినిమా పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నాడో అర్థం అయ్యింది.

ఈ చిత్రాన్ని కూడా ఆయన రేంజ్ కు తగ్గట్లుగానే తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి మరియు ప్రశాంత్ నీల్ తో కలిసి సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జెర్సీ సినిమా తో నేషనల్ స్థాయి అవార్డు అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తొందరలోనే పూర్తి చేసి ఇప్పుడు చరణ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడట. ఈ సినిమా కథ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తప్పకుండా రామ్ చరణ్ కు మంచి పేరు తీసుకు వస్తుందని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: