ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?
అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు సినిమాలో ప్రధానపాత్రలో నటించిన హీరోయిన్ మీరా మిథున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలో హీరోయిన్ మీరా మిథున్ షూటింగ్ నుంచి పారిపోయింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ 80 శాతం పూర్తయిన తర్వాత మీరా మిథున్ ను అనుకోని విధంగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మీరా మిథున్ బెయిలు మీద బయటకు రావడంతో మిగతా 20 శాతం షూటింగ్ కొడైకెనాల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.
మొదట్లో షూటింగ్కి ఎప్పటిలాగానే హాజరైన మీరా మిథున్ ఇక మరో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో తనతో పాటు వచ్చిన ఆరుగురు వ్యక్తులతో కలిసి షూటింగ్ స్పాట్ నుంచి పారిపోయింది అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. దీంతో ఇక మిగిలిన షూటింగ్ ఎలా చేయాలో అర్థం కాలేదు.. కానీ ఎంతో ఆలోచించి సినిమా కథను మార్చి చివరికి మీరా మిథున్ పాత లేకుండా కొత్త స్టోరీ రాసుకుని మిగిలిన షూటింగ్ పూర్తి చేసాము అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.