మెగా ఫ్యామిలీకి దూరంగా కళ్యాణ్ దేవ్.. ఏం జరుగుతోంది..!
ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న కళ్యాణ్ ఈ మూడు సినిమాలు తన కెరీర్ ను గాడిన పెడతాయన్న ఆశతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కళ్యాణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడట. ఇందుకు కారణం కూడా రామ్ చరణ్ అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకున్న వేడుకలలో కూడా ఎక్కడా కనిపించడం లేదు.
దీనికితోడు ఇటీవల శ్రీజ కూడా కొద్దిరోజులుగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో భర్త కళ్యాణ్ తో ఉన్న ఫోటోలు పెట్టడం లేదు. భార్య భర్తల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని ... అందుకే మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దూరం దూరంగా ఉంటున్నాడని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే శ్రీజ బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ మాత్రం తన భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఈ రూమర్లకు కొంతవరకు చెక్ పెట్టాడు.
అయితే రామ్ చరణ్ - కళ్యాణ్ దేవ్ మధ్య గ్యాప్ తోనే కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడని అంటున్నారు. మరి వీరిద్దరు కలిసి ఓ ఫొటో ఏదైనా షేర్ చేస్తే ఈ రూమర్లకు కొంత వరకు చెక్ పడడం ఖాయం. అసలు నిజం ఏంటో మరి వీరికే తెలియాలి.