అయ్యో.. పుష్ప గురించి అందరికి టెన్షన్ అదేనా...?

murali krishna
పెద్ద సినిమాల బడ్జెట్ విషయంలో లెక్కలు ఎప్పుడు కరెక్ట్ గా ఉండవట.

ఎలాగూ స్టార్ హీరోతో సినిమాను పూర్తి చేయాలంటే వందల కోట్లు ఖర్చు ఉంటుందని ఆ ఖర్చును సమర్ధవంతంగా పెట్టే ఆనవాయితీ మన దర్శకుల్లో తక్కువని తెలుస్తుంది.. ఇక సుకుమార్ లాంటి దర్శకుడు అయితే, ఆ విషయంలో ఎప్పుడూ వెనుకే ఉంటారట.సహజంగానే సుకుమార్ సినిమాలంటే బడ్జెట్ పరిమితులు దాటిపోతాయని పెర్ఫెక్షన్ కోసం సుక్కు బడ్జెట్ ను అడ్డగోలుగా పెంచుకుంటూ పోతాడని తెలుస్తుంది.

ఇప్పుడు పుష్ప విషయంలో కూడా బడ్జెట్ పెరిగింది. దాదాపు ముప్పై నుంచి నలభై కోట్లు బడ్జెట్ పెరిగిందని తెలుస్తుంది.. కేవలం పాటల కోసమే సుకుమార్ 16 కోట్లను ఖర్చు పెట్టించాడట.పాన్ ఇండియా సినిమా అంటూ లేనిపోని గొప్పలకు పోయి సుక్కు మొత్తానికి నిర్మాతల జేబుకు చిల్లు పెట్టించాడట.. కానీ సినిమా రిలీజ్ కి దగ్గర పడే సమయానికి గానీ, అసలు విషయం అర్ధం కాలేదని తెలుస్తుంది..

ఒకపక్క బడ్జెట్ పెరిగింది మరోపక్క అవుట్ ఫుట్ పై 'సుక్కు' కు నమ్మకం రావడం లేదని తెలుస్తుంది.. ఒక దర్శకుడిగా సుకుమార్ పక్కా పెర్ఫెక్షనిస్ట్. సినిమా బాగా రావాలని చివరి వరకు ప్రయత్నిస్తాడని అందరికి తెలుసు.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడడని అందుకే మొదటి నుంచి పుష్ప బడ్జెట్ విషయంలో అసలు తగ్గేదే లే అంటూ ముందుకుపోయాడట.

కానీ, సినిమాకి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయట.. సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోందని కానీ సుక్కు మాత్రం సినిమాలో కొన్ని సీజీ షాట్స్ కోసం ముంబైలో కసరత్తులు చేస్తున్నాడట.రిలీజ్ కి నాలుగు రోజుల ముందు వరకు ఇంకా ఫస్ట్ కాపీని సుక్కు రెడీ చేయకపోవడమే ఇప్పుడు బయ్యర్లను బాగా టెన్షన్ పెడుతుందని తెలుస్తుంది.

ఒకవేళ సినిమాకి అనుకున్నట్లు గొప్ప పేరు అండ్ హిట్ టాక్ రాకపోతే ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం కష్టంమని తెలుస్తుంది.పైగా బన్నీకి వందల మార్కెట్ ఏమి లేదని ఒక విధంగా అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బడ్జెట్ పెట్టింది పుష్పకేనట.అందుకే, నిర్మాతలు కూడా బాగా టెన్షన్ పడుతున్నారట బడ్జెట్ విషయంలో సుకుమార్ కి నిర్మాతలకు అభిప్రాయబేధాలు కూడా వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోందని మొత్తమ్మీద పుష్ప విషయంలో అందరికీ టెన్షనే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: