హరీష్ శంకర్ కి హ్యాట్రిక్ ఇచ్చేనా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నాడు హరీష్ శంకర్. ఆయన తన కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు కొన్ని చేశాడు. వాటిలో గబ్బర్ సింగ్ సినిమా ఒకటి. ఆయన కెరీర్ తొలినాళ్లలో ప్రేక్షకులను అలరించే ఎన్నో సినిమాలను రవితేజతో కలిసి ఆయన చేసిన మిరపకాయ చిత్రం ఆయనను దర్శకుడుగా నిలబెట్టింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఛాన్స్ ఇవ్వగా ఆ చిత్రంతో దర్శకుడిగా ఎదిగాడు హరీష్ శంకర్.

ఒకదాని తర్వాత ఒకటి ఆయనకు పెద్ద హీరోల సినిమాల అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఆ విధంగా ఎన్టీఆర్ తో కలిసి ఆయన రామయ్య వస్తావయ్యా అనే సినిమా చేయగా అది బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి డీజే సినిమా చేయగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఆయన వరుణ్ తేజ్ తో చేసిన గద్దల కొండ గణేష్ అనే సినిమాతో హిట్ కొట్టి మరొకసారి పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. 

భవదీయుడు భగవద్గీత అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  తొందరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే ఒక్కసారిగా పవన్ అభిమానులు ఎగిరి గంతేశారనే చేశారనే చెప్పాలి. గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిన విధంగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని వారు ఎంతగానో కోరుకుంటున్నారు.  ఇకపోతే హరీష్ శంకర్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ల మూడవ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం తో ఆల్బమ్ పరంగా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో. మరి దేవిశ్రీ ప్రసాద్ మూడో సారి హరీష్  శంకర్ తో కలిసి పనిచేస్తుండగా ఈ ఆల్బమ్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో మరీ.




 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: