శివ శంకర్ మాస్టర్ మృతి ... శోకసంద్రంలో టాలీవుడ్ .... !!
అలానే ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా సహాయం ఆడించినప్పటికీ కూడా శివ శంకర్ మాస్టర్ మనకు దక్కలేదు. కొద్దిగంటల నుండి ఆయన పరిస్థితి మరింతగా విషమించిందని, కాగా తాము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈరోజు రాత్రి 8 గం.లకు ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు సినిమా ప్రముఖులు శివశంకర్ మాస్టర్ మృతికి నివాళులు అర్పిస్తుండగా ఆయన పార్థివ దేహాన్ని రేపు బంధువులు, అభిమానుల సందర్శనార్ధం ఆయన స్వగృహంలో ఉంచనున్నట్లు సమాచారం.
కెరీర్ మొదటి నుండి చిన్న స్థాయి నుండి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి పైకి వచ్చిన శివ శంకర్ మాస్టర్ తెలుగు సహా పలు ఇతర భాషల్లోని సినిమాల సాంగ్స్ కి నృత్య దర్శకత్వం వహించారు. అలానే పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేయడంతో పాటు ఇటీవల పలు టివి షో ల్లో సైతం కనిపించి అందరినీ అలరించిన శివ శంకర్ మాస్టర్ రేపటి నుండి మన మధ్యన ఉండరు అనే విషయం తలుచుకుంటుంటేనే ఎంతో బాధగా ఉంది అంటూ పలువురు ఆయనతో పని చేసిన ఆర్టిస్టులు చెప్తున్నారు.