దృశ్యం - 2 తో మరొక హిట్ లభించినట్లేనా ... ??
ఇటీవల వెంకటేష్ నటించిన దృశ్యం పార్ట్ 1 మూవీ సూపర్ హిట్ కొట్టగా దానికి సీక్వెల్ గా తీసిన సినిమానే దృశ్యం 2. అందరిలోనూ మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన దృశ్యం 2 నిన్న విడుదల తరువాత నుండి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది అనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమాని ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో నడిపిన విధానం పై అందరూ కూడా పొగడ్తలు కురిపిస్తున్నారు. వెంకటేష్, మీనా తో పాటు సినిమాలోని ప్రధాన పాత్రదారులు అందరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించడం సినిమాకి మరింత ప్లస్ అయింది.
ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా సాగిన ఈ సినిమా, సెకండ్ హాఫ్ లో మరింత రసవత్తరంగా కొనసాగడం తో అందరి మన్ననలు దక్కించుకుంటోంది. టేకింగ్, స్క్రీన్ ప్లే, బీజీఎమ్, నటీనటుల పెర్ఫార్మన్స్, ఆకట్టుకునే విజువల్స్ వెరసి దృశ్యం 2 మూవీ కి మొత్తంగా సూపర్ హిట్ టాక్ లభించేలా చేసాయి అని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ప్రేక్షకుల తో పాటు పలువురు సినిమా విశ్లేషకులు సైతం ఈ మూవీ పై పాజిటివ్ గా రివ్యూలు ఇస్తూ ఉండడంతో దృశ్యం 2 యూనిట్ అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఫైనల్ గా తమ హీరో మరొక సూపర్ హిట్ సినిమాని తమ ఖాతాలో వేసుకోవడంతో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ అయితే మరింత సంతోషంగా ఉన్నారు.