సూర్యకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే : జ్ఞానవేల్
అదే సమయంలో జై భీమ్ సినిమాకి కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జై భీమ్ వివాదంపై కొన్ని వర్గాల ప్రజలు సూర్య పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. జై భీమ్ సినిమా వివాదానికి పూర్తి బాధ్యత సూర్య వహించాలి అంటూ కోరుతున్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన జై భీమ్ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ పూర్తి బాధ్యత తనదే అంటూ చెప్పుకొచ్చారు. విడుదలకు ముందు మా చిత్ర బృందం అందరం కలిసి సినిమా చూసాం. అభ్యంతరమైన క్యాలెండర్ దృశ్యాన్ని గమనించలేకపోయామ్. ఒకవేళ అక్కడ గమనించి ఉంటే దాన్ని తొలగించే వాళ్ళం. ఇక విడుదలైన తర్వాత కొంతమంది అసహనం వ్యక్తం చేయడంతో సంబంధిత సీన్లో కొన్ని మార్పులు కూడా చేశాం.. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని భావిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై సూర్య బాధ్యత వహించాలని కోరుతున్నారు.. కానీ పూర్తి బాధ్యత నాదే. సూర్య ఒక నటుడిగా నిర్మాతగా గిరిజనుల సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం మాత్రమే చేశాడు. గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న పరిణామాలకు సూర్య క్షమించాలని కోరుతున్నాను అంటూ దర్శకుడు జ్ఞానవేల్ తెలిపాడు.. కష్టకాలంలో మాకు మద్దతుగా నిలిచిన రాజకీయ సినీ ప్రముఖులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు జ్ఞానవేల్. ప్రముఖ న్యాయవాది చంద్రు కెరీర్ లో నిలిచిన కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది అనే విషయం తెలిసిందే. చేయని తప్పుకు జైలు పాలైన గిరిజన జీవితాన్ని ఇక ఈ సినిమాలో చూపించారు. అమెజాన్ ప్రైమ్ వేదిక విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.