విలన్ అంటే కైకాలే.. నాటి నుంచి నేటి వరకు?
కాగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన నటించని పాత్ర అంటూ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కైకాల సత్యనారాయణ కెరీర్లో ఎక్కువుగా చేసింది మాత్రం విలన్ రోల్స్ అనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు లాంటి నాటి తరం హీరోలకే కాదు బాలకృష్ణ నాగార్జున చిరంజీవి లాంటి మొన్నటి తరం హీరోల సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ విలన్ పాత్రను పోషించడం గమనార్హం. ఇక ఎన్నిసార్లు విలన్ పాత్రలో నటించిన కూడా కొత్తదనాన్ని తన నటనతో ప్రేక్షకులకు చూపించేవారు కైకాల సత్యనారాయణ.
ఇక బీభత్సమైన విలనిజం చూపించడంలో కైకాల సత్యనారాయణ తర్వాతే ఎవరైనా. ఆయన చేసిన పాత్రలు కారణంగా ప్రేక్షకుల్లో ఆయనకు కాస్త నెగిటివ్ క్రేజ్ ఉండేది. ఆయనను చూస్తే చాలా మంది భయపడేవారు. ఇక పలుమార్లు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో కూడా కైకాల సత్యనారాయణ పై మాటల దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయట. అయితే కాస్త వయసు పైబడిన తరువాత మాత్రం ఇక ఎమోషనల్ పాత్రలు చేయడం మొదలుపెట్టారు సత్యనారాయణ. హీరోయిన్ తండ్రి లేదా తాత పాత్రలు చేయడం లాంటివి చేస్తూ తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యారు. 2019 లో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు మహర్షి సినిమాలలో నటించి చివరగా ప్రేక్షకులను అలరించారు కైకాల సత్యనారాయణ. కాగా ఇటీవల ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరారు కైకాల సత్యనారాయణ. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం అత్యంతవిషమంగా ఉండడంతో ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.