అఖండ సినిమాలో ఆ 45నిమిషాలు ఫ్యాన్స్ కు పూనకాలే..!!

VUYYURU SUBHASH
నందమూరి నట సింహం బాలయ్య..ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీగా మాస్ స్టెప్పులతో దుమ్ములెపేస్తున్నారు. తనను ఆరాధించే కోట్లాది మంది అభిమానుల కోసం సరికొత్త గా ఆలోచిస్తూ..కొత్త కధలతో..విభిన్నమైన డ్యాన్స్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఇక ఈయన సినిమాలు అంటే మనకు ముందుగా గుర్తువచ్చేది యాక్షన్ సీన్స్. బాలయ్య సినిమాలకి అదే హైలెట్ గా నిలుస్తుంది. ఆయన తొడ కొడితే కదిలే ట్రైన్ కూడా ఆగిపోవాల్సిందే. అలాంటి సన్నివేశాలు ఇప్పటికే ఆయన సినిమాలో బోలెడు చూసాం.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం "అఖండ". బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై అభిమానులు ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇక అభిమానుల ఆశలను డబుల్ చేస్తూ చిత్ర బృందం  ఈ సినిమా ట్రైలర్ ను వదిలింది. ఈ ట్రైలర్ లో  ఊర మాస్ డైలాగులతో బాలయ్య రెచ్చిపోయాడు. ట్రైలర్ టాక్ బట్టి చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయడం పక్కా అనిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో బాలయ్య అభిమానులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయట. ముఖ్యంగా  ఇంటర్వెల్ ముందు వచ్చే అరగంట సేపు బాలయ్య ఫైట్  సీన్స్ చూస్తే ఫ్యాన్స్ తమ సీట్లల్లో కూర్చో లేరు అని, విజిల్స్  తో ధియేటర్స్ దద్దరిల్లడం పక్కా అని అంటున్నారు. బాలయ్య- బోయపాటి  సినిమాలకు యుఏ సర్టిఫికెట్ ఇవ్వడం  చాలా కామన్ విషయమే. ఇక ఈసారి కూడా అదే జరిగింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ రన్ టైం  2.47 గం.లు ఉండగా.. అందులో 45 నిమిషాలు  మొత్తం ఈ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ షేడ్స్ మాస్ అభిమానులకు బాగా నచ్చుతుందని  అని అంటున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ కాకుండానే అఖండ హిట్ టాక్ సొంతం చేసుకుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: