చరణ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా
రామ్ చరణ్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాగా ఈ చిత్రం తర్వాత ఆయన గౌతమ్ తిన్ననూరి అనే యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ విధంగా ఒక సీనియర్ డైరెక్టర్ మరియు యంగ్ డైరెక్టర్ లతో ఆయన సినిమాలు ప్లాన్ చేసి సక్సెస్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ మరొకసారి సీనియర్ దర్శకుడితో స్టార్ దర్శకుడు తో సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా రామ్ చరణ్ తన కెరియర్ ను ఎంత గా బిల్డ్ చేసుకుంటున్నాడో అర్థమవుతుంది. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఆయన తన కెరియర్ ను బిల్డ్ చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్నాడు. మెగాస్టార్ తర్వాత ఆయన వారసుడిగా అంతటి వాడిగా ఎదగడానికి బాగా కష్టపడుతున్నాడు రామ్ చరణ్. మరి ఆయన కష్టానికి ఫలితం ఏ రూపంలో దక్కుతుందో చూడాలి. నటన పరంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు రాబోయే సినిమాలతో తండ్రికి మించిన కొడుకు గా తనని తను నిరూపించుకుంటాడా అనేది చూడాలి.