మహేష్ సూపర్ స్టార్ కాదు.. మనసున్న శ్రీమంతుడు?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు.. ఇక అటు సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా సూపర్స్టార్ అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో కోట్లరూపాయలను వదిలేసి ఏకంగా ప్రజలకు ఏదో సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతాడు మహేష్ బాబు. అచ్చంగా నిజజీవితంలో కూడా మహేష్ బాబు అలాంటి గొప్ప మనసును చాటుకుంటున్నాడు అనే చెప్పాలి. ఏకంగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కి కృషి చేస్తున్నాడు.
అంతే కాదు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ తెర మీదే కాదు తెర వెనుక కూడా హీరో అనిపించుకున్నాడు. గత కొంత కాలం నుంచి ఆంధ్ర హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి చిన్నారులకు హార్ట్ సర్జరీ లు చేస్తూ కొత్త ఊపిరి పోస్తూ పునర్జన్మను అందిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇలా గుండె సమస్యతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారుల కన్నీళ్లను తుడుస్తూ ఒక గొప్ప మనసున్న మహారాజు గా మారిపోయాడు మహేష్ బాబు. అంతేకాదు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు..