తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది హీరోయిన్ జ్యోతిక. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ మలయాళ సినిమా పరిశ్రమలో కూడా ఈమె సినిమాలు చేస్తూ అక్కడ నటిగా మంచి గుర్తింపు పొందింది. తమిళనాడు రాష్ట్ర అవార్డు అందుకొని నటిగా ఆమె ఎంతో ఎత్తుకు ఎదగగా జ్యోతిక హీరో సూర్య పెళ్లి చేసుకుని ఆమె సంసార జీవితాన్ని ఎంతో సుఖమయంగా గడుపుతుంది.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఈమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలుగులో షాక్, ఠాగూర్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఈమె ఆ తర్వాత మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఈమె ఎక్కువగా సినిమాలో నటించలేదు. పెళ్లి తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ ఈమె తన ప్రత్యేకతను మళ్ళీ చాటుకోవాలని భావిస్తుంది. ముంబై లో జన్మించిన ఈమె తండ్రి కూడా నిర్మాత కావడంతో సినిమా పరిశ్రమలోకి రావడం ఎంతో ఈజీ అయింది.
ఈమె హీరోయిన్ నగ్మా కు చెల్లి అవుతుంది. ఏ విధంగా అంటే ఈమె తల్లి మొదటి భర్త సంతానం హీరోయిన్ నగ్మా కావడం విశేషం. ఇంకో సోదరి రోషిని కూడా సినిమాల్లో నటిస్తోంది. సూర్యతో వివాహమైన తర్వాత ఈమె ఎక్కువగా తన కుటుంబ ఆలనాపాలనా చూసుకోవడం చేసింది. ఎక్కువగా సినిమాలలో నటించలేదు. వీరిద్దరి సంతానం కూడా ఉంది. ఓ కూతురు మరియు కొడుకు కూడా ఉన్నారు. భర్త సూర్య కు అన్ని విధాలుగా సహాయం చేస్తూ పర్సనల్ గా కెరియర్ గా ఆయన ముందుకు పోవడానికి ఎంతగానో దోహదపడుతుంది జ్యోతిక.ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ఇటీవలే అయన జై భీమ్ అనే సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా అది సూపర్ హిట్ అయ్యి అయన కు మంచి పేరును తీసుకొస్తుంది.