తెలుగు స్టార్ హీరోల అత్యధిక రెమ్యునరేషన్లు ఇవే...!

VUYYURU SUBHASH
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వేలల్లో పారితోషకం తీసుకోవడం మొదలుపెట్టి, ఆ తర్వాత లక్షల్లో తీసుకోవడం మొదలు పెట్టారు.. కానీ గత కొన్ని సంవత్సరాల కిందట సుమారుగా 10 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవారు.. కానీ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మూవీ ల  వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వీరందరూ కూడా సుమారుగా రూ.50 కోట్లకు పైగానే రెమ్యునరేషన్  తీసుకోవడం గమనార్హం.

1. ప్రభాస్:
దేశంలోనే రూ.వందకోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం అన్ని  పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కాబట్టి అందుకే ఆ మాత్రం వుంటుందని అందరూ అనుకుంటున్నారు.

2. పవన్ కళ్యాణ్:
రాజకీయాల నుంచి సినీ ఇండస్ట్రీలోకి తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఈయన ప్రస్తుతం 55 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు.

3. మహేష్ బాబు:
 సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా కోసం 55 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.

4. జూనియర్ ఎన్టీఆర్:
ఆర్. ఆర్. ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం  జూనియర్ ఎన్టీఆర్ 45 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారట.

5. రామ్ చరణ్:
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో  తన 15 వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాను ఈయన 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

6. చిరంజీవి:
ఈయన ఒక్కో సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారట.

7. అల్లు అర్జున్:
పాన్ ఇండియా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ 60 కోట్ల రూపాయలను అందుకున్నారట.

8. బాలకృష్ణ:
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ రూ.11 కోట్ల రూపాయలను అందుకుంటున్నారు.

9. నాగార్జున:
బంగార్రాజు సినిమా కోసం ఈయన 7 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: