బిగ్ బాస్ 5 : తిరగబెట్టిన జెస్సి ప్రాబ్లం?
ఇకపోతే ఇటీవలే హౌస్ లో మొన్నటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగిన జెస్సి గత కొన్ని రోజుల నుంచి వర్టిగో వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎక్కువ కావడంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది అన్న విషయం తెలిసిందే. దీంతో అతనికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం వచ్చింది. దీంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వైద్యులు అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఇక ప్రస్తుతం మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు అతని సీక్రెట్ రూమ్ లో ఉంచారు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జెస్సీ అటు హౌస్ లో అందరూ ఆడుతున్న ఆట ను వీక్షిస్తూ ఉన్నాడు.
ఇకపోతే ఇటీవలే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ వర్టీకో వ్యాధి మరింత ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సి సరిగా సరిగ్గా చూడలేకపోతున్నానని ఒక వైపు నెట్టేసినట్లు గా పడి పోతున్నాను అంటూ బిగ్ బాస్ కి చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ తెలిపాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్లు రాగా తన చేతులు కూడా లావు అయి పోయినట్లు కూడా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా అనిపించలేదు అంటూ డాక్టర్లకు తెలిపాడు జెస్సీ. ఇక మెరుగైన వైద్యం అవసరం అంటూ చెప్పిన డాక్టర్లు అందుకు తగ్గట్టుగానే ట్రీట్మెంట్ ఇస్తున్నామని ధైర్యంగా ఉండాలి అంటూ భరోసా ఇచ్చారు.