పెళ్ళా.. అయ్యయ్యో వద్దమ్మ అంటున్న యాంకర్ ప్రదీప్?
అయితే యాంకర్ ప్రదీప్ బుల్లితెర మీద కనిపించినప్పుడల్లా అందరూ అడిగేది ఒకటే ప్రశ్న.. వయసు ధాటి పోతుంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని.. ఇలా చాలా మంది బుల్లితెరపై ప్రదీప్ ను చాలా సార్లు పెళ్లి గురించి ప్రశ్నించారు. అయితే ఎవరు ఎన్ని సార్లు పెళ్లి గురించి అడిగినా కూడా సమాధానం దాటవేస్తూ వస్తున్నాడు ఆ యాంకర్ ప్రదీప్. ఇకపోతే ఇటీవల యాంకర్ శ్రీముఖి ప్రదీప్ నీ పెళ్ళెప్పుడు అని అడిగింది దీంతో ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు యాంకర్ ప్రదీప్. మొన్నటి వరకు బుల్లితెర పై వరుస కార్యక్రమాలతో అదరగొట్టిన యాంకర్ ప్రదీప్.. ఇక ఇటీవల ఏకంగా తెలుగు ఓటిటి ఆహా వేదికగా సర్కార్ అనే ఒక షో కూడా ప్లాన్ చేసాడు.
ఈ క్రమంలో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీల ను గెస్ట్లుగా పిలిచి వారితో వివిధ టాస్కులు ఆడిస్తూ ఉంటాడు యాంకర్ ప్రదీప్. ఇకపోతే ప్రదీప్ యాంకరింగ్ లో వస్తున్న సర్కార్ ఎపిసోడ్ 3 కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలయింది. ఈ క్రమంలోనే కమెడియన్ అలీ తో పాటు యాంకర్ శ్రీముఖి కూడా షో లోకి వచ్చేసింది. అయితే నా పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే అంటూ కమెడియన్ అలీని అడుగుతుంది శ్రీముఖి. ఇక అంతలోనే నీ పెళ్లి కూడా జరగాలి అంటూ ప్రదీప్ కు చెప్తుంది యాంకర్ శ్రీముఖి. ఇక అంతలో అందుకున్న ప్రదీప్ అయ్యయ్యో వద్దమ్మా అంటూ ఇటీవల కాలంలో ఫేమస్ అయిన డైలాగ్ చెప్పి అందర్నీ నవ్విస్తాడు.