ఆ క్యారెక్టర్ మళ్ళీ చేయబోతున్న దళపతి విజయ్..!

murali krishna
తళపతి విజయ్‌కు తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలుస్తుంది.ఈయన సినిమా వచ్చిందంటే ఆయన ఫ్యాన్స్‌కు పండగేనని తెలుస్తుంది.పైగా ఇటీవల ఈయన నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయని తెలుస్తుంది.

ఏడాది మొదట్లో మాస్టర్ సినిమా ప్రభంజనం సృష్టించిందట. కరోనా మొదటి వేవ్ తర్వాత థియేటర్లలోకి ప్రేక్షకులు రావడానికి జంకుతున్న సమయంలోనూ విడుదలై రికార్డు కలెక్లన్లు రాబట్టిందని తెలుస్తుంది.తెలుగులోనూ ఈ సినిమా హిట్‌గా నిలిచిందని ఇప్పుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చిందట.విజయ్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్‌నే ఉందని అందరికి తెలుసు.ఈయన సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయట.అందుకే టాలీవుడ్‌ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు నేరుగా తెలుగులో ఒక సినిమా చేయబోతున్నాడట విజయ్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుందట.ఇదిలా ఉంటే నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని సమాచారం.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన విజయ్ లుక్ గూస్‌బంప్స్ పుట్టిస్తున్నాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ మరియు అందులో విజయ్ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు బయటకొచ్చిందట.

ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు సమాచారం.ఒక షాపింగ్ మాల్‌లో హైజాక్ అయిన ప్రజలను తన టీమ్‌తో కాపాడబోయే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇంతకుముందు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమాలో కూడా విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించాడని ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచిందని తెలుస్తుంది. ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: