ఒక మంచి సినిమాకి ఎన్నిఅడ్డంకులా.. వివాదంలో జై భీమ్..!!

P.Nishanth Kumar
ఈ మంగళవారం అమెజాన్ ప్రైమ్ లో సూర్య హీరోగా నటించిన జై భీమ్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. 90వ దశకంలో తమిళనాడులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా  సినిమా కు మంచి పేరు వచ్చింది. తప్పుడు కేసు పెట్టి పోలీసులు చూపించిన కర్కషత్వనికి లాకప్ లో చనిపోయిన ఓ గిరిజనుడు కి అతని కుటుంబానికి న్యాయం చేసేందుకు ఓ లాయర్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ చిత్రం కు ఇప్పటి వరకు మంచి పేరు రాగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ చిత్రం.

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ వివాదం ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఓ గొప్ప కథ ను పగడ్బందీగా తెరకెక్కించి దర్శకుడు ప్రేక్షకులు మెచ్చే విధంగా హృద్యంగా తీర్చిదిద్దిన వైనం కు ప్రేక్షకులు ఎంతగానో కదిలిపోయారు. రిలీజ్ ముంగట ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నా కూడా విడుదల అయిన తర్వాత ఈ సినిమా ఒక అద్భుతం అంటూ పొగడడం తో ఈ సినిమాపై ఆదరణ పెరుగుతోంది. వివిధ భాషల వాళ్ళు ఈ సినిమా లోని ప్రతి సన్నివేశానికి కనెక్ట్ అవుతుండగా ఉత్తరాదిన మాత్రం ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రుచించడం లేదు.

ప్రకాష్ రాజ్ పాత్ర ఓ సీన్ లో చేసే  నటన పై వారు ఎంతగానో మండిపడుతున్నారు. కేసు పరిశీలన లో మార్వాడి సేట్ నుంచి వివరాలు అడుగుతున్న సమయంలో అతను హిందీలో ఏదో చెప్పబోయాడు. ప్రకాష్ రాజ్ కోపంగా అతనిని చెంపమీద లాగి పెట్టి కొట్టి తమిళం లో మాట్లాడమని చెబుతాడు. ఈ సీన్ ఉత్తరాది ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించడం లేదు. హిందీ వారి చులకన చేసి మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు. అలా చేయడం వల్ల ఆ భాష మీద ద్వేషం పెరుగుతుందో అని వారు మండిపడుతున్నారు. గత కొన్నేళ్లలో తమిళ భాషతో సహా దక్షిణాది భాషా చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్న ఉత్తరాది ను ఇలాంటి సన్నివేశాల్ని పెట్టీ అవమాన పరచడం కరెక్ట్ కాదని వారు విమర్శిస్తున్నారు. వెంటనే ఈ సన్నివేశాన్ని తొలగించాలని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: