ఆ సినిమా తీయొద్దన్న రవిబాబు వినిపించుకోలేదట...!

murali krishna
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందట.అయితే అవును సినిమా కథ ఎలా పుట్టుకొచ్చింది రవి బాబు ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే రవి బాబు తాను ఒక థ్రిల్లర్ మరియు లవ్ స్టోరీ ఇలా మూవీస్ తీయాలని అనుకున్నట్టు డైరెక్టర్ నివాస్ తెలిపారని తెలుస్తుంది.. ఆ సమయంలోనే తన భార్య ఒక విషయం చెప్పిందని ఆయన తెలియజేశారట.. మన ఇంట్లో ఇంకా ఎవరో ఉన్నారని అది ఘోస్ట్ లాగే అన్పిస్తుంది అని అనేసరికి ఆ మాటలను తాను కొట్టి పారేసినట్లు ఆయన తెలిపారని సమాచారం.

అలా ఒక 4 రోజులయ్యాక మళ్ళీ తాను వచ్చి వాడు మల్లీ వచ్చాడు అని చెప్పిందని ఆయన అన్నారట అప్పుడు కూడా తాను జోక్ గా ఏదో అంటే మీకు అన్నీ జోక్ గా అయిపోయింది అని ఆమె విసుక్కున్నట్టు అయన అన్నారని తెలుస్తుంది.

ఆ తర్వాత ఒక 15 రోజులు తాను ఏదో పని మీద బెంగళూర్ కి వెళ్లానని నివాస్ అన్నారట.అక్కడి నుంచి రాగానే మళ్లీ తన భార్య మళ్లీ ఘోస్ట్ కనిపించాడు అని చెప్పేసరికి ఏంటి ఇది అనుకొని, నెక్స్ట్ డే రవి బాబు దగ్గరికి వెళ్లానని ఆయన అన్నారట . అప్పుడే సినిమా కథ కోసం చూస్తున్న సమయంలో తన ఇంట్లో జరిగిన విషయాలను తనకు చెప్తే వెంటనే దీన్నే సినిమాగా తీద్దామని చెప్పడంతో అవును సినిమా పుట్టిందని ఆయన వివరించారని తెలుస్తుంది.

అలా అయిన తర్వాత మళ్లీ తాము వేరే ఇంట్లోకి మారక కూడా తన భార్య అలాగే చెప్తుందని రవికి చెప్తే ఆయన దాన్ని అవును 2 గా తీద్దామని చెప్పడంతో దానికి తాను ఒప్పుకోలేదని ఆయన అన్నారని తెలుస్తుంది.. తెలుగులో సీక్వెల్స్ కి అంత డిమాండ్ లేదని ఆ సినిమా చేయడానికి తాను ఒప్పుకోనని చెప్పారట.అసలు నువ్వు కూడా ఈ సినిమా తీయకు అని తాను రవి బాబుకు చెప్పినట్టు ఆయన వివరించారని తెలుస్తుంది.దీంతో రవిబాబు ఎలాగైనా ఈ సినిమా తీసి విజయం సాధించి చూపిస్తా అంటూ తనకు సవాల్ విసిరాడని కానీ, ఇప్పటికీ కూడా చాలా మందికి అవును 2 ఎప్పుడొచ్చిందో తెలీదని అసలు అవును 2 సినిమా ఎవరికీ గుర్తు లేదని ఆయన చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: