తాత లా పౌరాణిక పాత్ర లపై దృష్టి పెడుతున్న ఎన్టీఆర్!!

P.Nishanth Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడు గా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ ప్రధానమైన చిత్రాలు ఎక్కువగా చేసుకుంటూ వచ్చి మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. తన సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు.

ఈ చిత్రంతో తొలిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనుండగా అది పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తుండగా ఆ తరువాత ఆయన పౌరాణిక సినిమా చేసే విధంగా ఆలోచన చేస్తున్నాడట.

తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణిక సినిమా అనగానే పెద్ద ఎన్టీఆర్ తీసిన సినిమాలే అందరికీ గుర్తుకు వస్తాయి. ఎన్నో సినిమాలలో ఆయన పౌరాణిక పాత్రలు చేసి అసలైన వారిని మైమరిపించే విధంగా ఆయన పౌరాణిక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తరువాత అంతటి స్థాయిలో పౌరాణిక పాత్రలలో మెప్పించిన హీరో ఇంతవరకు పుట్ట లేదని చెప్పాలి. యమదొంగ సినిమాలో యముడిగా పౌరాణికంగా నటించి ఎన్టీఆర్ మళ్లీ ఆయనను గుర్తు చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో పూర్తి స్థాయి పౌరాణిక సినిమా చేయాలని ఎన్టీఆర్ భావించాడు. ఈ నేపథ్యంలో ఆ పౌరాణిక సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి. ఎన్టీఆర్ పౌరాణిక సినిమా చేస్తున్నాడు అనగానే ఆయన అభిమానులలో ఏ రకమైన పౌరాణిక సినిమా ఎన్టీఆర్ చేస్తున్నాడు ఏ పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాడు అన్న ఎదురుచూపులు మొదలైయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: