రాంగ్ స్టెప్ వేసిన శ్రీకాంత్...!

murali krishna
హీరో కొడుకు హీరో అలాగే ప్రతి నాయకుడి కొడుకు ప్రతి నాయకుడు అనే కొటేషన్ మనదేశంలో చాలా కామన్ అని అందరికి తెలుసు.. ఈ క్రమంలోనే చాలమంది హీరోల కొడుకులుఅలాగే కూతుళ్లు తెరకు పరిచయమయ్యారనీ సమాచారం.


ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు తన కొడుకులను సినిమా ఇండస్ట్రీ వైపు కాకుండా మరో రంగంవైపు మళ్లించారనీ తెలుస్తుంది.. కానీ మిగతా హీరోలు మరియు నటులంతా తమ పిల్లలు సినిమా రంగంలోనే ఎదగాలని ఆలోచిస్తున్నారనీ తెలుస్తుంది.ఇందుకు కొన్నేళ్లుగా ప్లాన్ చేసుకుంటూ జాగ్రత్తగా లాంచ్ చేస్తున్నారనీ సమాచారం.ఈ క్రమంలో కొంతమంది స్టార్ హీరోల వారసులు సూపర్ సక్సెస్ అయితే కొంతమంది మాత్రం ఇంకా నిలదొక్కుకోవడానికే నానా తంటాలు పడుతున్నారనీ తెలుస్తుంది.. ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ కూడా తన కొడుకును తెరకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనీ తెలుస్తుంది.. అక్కినేని నాగార్జున నిర్మాణ సారథ్యంలో రోషన్ ని పరిచయం చేస్తూ నిర్మలా కాన్వెంట్ అనే సినిమా చేయించాడనీ అందరికి తెలుసు.. తీరా చుస్తే అది బోల్తా కొట్టిందనీ తెలుస్తుంది.ఒక హీరో కొడుకును పరిచయం చేస్తూ ఇంత ఔట్ డేటెడ్ సినిమా చేశాడేంటి అబ్బా శ్రీకాంత్ కి అస్సలు ఏమయింది అని చెవులు కొరుక్కున్నారట. ఆ సినిమా దర్శకుడు కూడా పెద్ద వయసు వ్యక్తి కావడం మరో అంశమని తెలుస్తుంది.అయితే.. ఆ తర్వాతైనా శ్రీకాంత్ తన కొడుకు రోషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిందనీ కానీ మళ్లీ అదే తప్పు చేశాడటఎంతో వైవిధ్యంతో మరియు వినూత్నమైన కథలతో సినిమాలు తీస్తున్న కొత్త తరం దర్శకులను కాదని  సీనియర్ దర్శకుడు మరియు పాతతరం దర్శకుడైన రాఘవేంద్రరావు మరియు ఆయన శిష్యురాలు గౌరి రోణంకిలకు కొడుకును అప్పజెప్పాడనీ ఫలితంగా పెళ్లిసందD అనే సినిమా.వచ్చిందని తెలుస్తుంది.


అప్పట్లో హిట్ కొట్టిన తన సినిమా పేరుకు మంచి క్లాసికల్ టచ్ కి టెంప్ట్ అయ్యాడేమో కానీ సినిమా మరియు కథ, స్క్రిప్టు గురించి అస్సలు పట్టించుకోనట్టున్నాడనీ తెలుస్తుంది.సినిమాల మీద అలాగే కథల మీద ఏ మాత్రం ఐడియా ఉన్నా కూడా పెళ్లిసందD కథ వింటే ఇది వర్కవుట్ కాదని చెప్తారనీ కానీ.. శ్రీకాంత్ మాత్రం గుడ్డిగా కథను మరియు దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావును నమ్మి రోషన్ ను ఆ సినిమా చేయించాడట. అయితే రాఘవేంద్రరావు గత ఇరవై ఏండ్లలో శ్రీరామదాసు వంటి భారీ సినిమా తప్ప వేరే సినిమా అంతటి విజయం రాలేదు.. భక్తి చిత్రాలు తప్పితే ఆ తర్వాత ఆయన పెద్దగా వేరే సినిమాలు చేసింది కూడా లేదనీ తెలుస్తుంది.దీంతో ఆ పాతకాలం కథలాగే అనిపించి థియేటర్లలోంచి ప్రేక్షకులు సగం నుంచే బయటకొచ్చేస్తున్నారే టాక్ వినిపిస్తుంది.. ఇలాంటి సినిమాతో కొడుకును పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేయాలని శ్రీకాంత్ చేసిన పొరపాటే అంటున్నారట సినీ విమర్శకులు. యంగ్ ఫిలిం మేకర్స్ అలాగే ట్రెండీగా సినిమాలు తీస్తున్న నిర్మాతల వైపు కాకుండా సీనియర్లను నమ్మితే నేటి తరం హీరోగా రోషన్ ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేయడంలో శ్రీకాంత్ కొడుకుకు మోసం చేసినట్టే అవుతుందంటున్నారట టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: