ప్రొఫెషనల్ లైఫ్ లో ఎవరు కూడా తమ పర్సనల్ లైఫ్ ను తీసుకు రావడానికి పెద్దగా ఇష్టపడరు. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు తమ భర్తల గురించి ఎప్పుడో గాని చెప్పరు. వారికి పెళ్ళైన విషయం కూడా చాలా గోప్యం గా ఉంటుంది. అలా మన బుల్లితెరపై వెండితెర పై తమా గ్లామర్ తో వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న యాంకర్ లు భర్తలు ఎవరు? వారు ఏం చేస్తారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ యాంకర్ గా ఉన్న అనసూయ భరద్వాజ్ ఇద్దరు పిల్లల తల్లి అని చాలామందికి తెలుసు. తన అందచందాలతో చురుకైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటు దశాబ్దకాలంగా ప్రేక్షకులను అలరిస్తుంది అనసూయ. ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ కాగా ఆయన ఓ వ్యాపారవేత్త. ఒకప్పుడు యాంకర్ గా క్యూట్ క్యూట్ మాటలతో తెలుగు వారిని ఎంతగానో అలరించిన ముద్దుగుమ్మ లాస్య, మంజునాథ్ అనే ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆమె మరొక సారి తన యాంకరింగ్ కెరీర్ రీ స్టార్ట్ చేసింది.
టాలీవుడ్ లో తన యాంకరింగ్ తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న సుమ భర్త రాజీవ్ కనకాల కూడా సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదయభాను భర్త విజయ్ ఒక బిల్డర్ కాగా పెళ్లి తర్వాత ఆమె రీ ఎంట్రీ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక యాంకర్ ఝాన్సీ భర్త జోగినాయుడు కూడా నటుడే. మరి యాంకర్ గాయత్రి భార్గవ్ భర్త విక్రమ్ ఒక ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నాడు. యాంకర్ శిల్పా చక్రవర్తి భర్త పేరు కళ్యాణ్ చక్రవర్తి. సమీరా భర్త అన్వర్. ఇతను సీరియల్స్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.