తండ్రి నిర్మాత మరియు తల్లి నటి కావడంతో హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా పరిశ్రమ లోకి రావడానికి పెద్దగా కష్ట పడలేదనే చెప్పాలి. చిన్నతనం నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది కీర్తి సురేష్. 2000 సంవత్సరం లోనే బాల నటిగా ఆమె తెరంగేట్రం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కోర్సు చేసి వెండితెరకు తిరిగి వచ్చిన తర్వాత హీరోయిన్ పాత్రలో నటించి కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఓ మలయాళ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఆ తర్వాత తమిళ తెలుగు చిత్రాల్లో నటించేందుకు వరుస అవకాశాలు వచ్చాయి. కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు చాలామంది సినిమా పరిశ్రమలోనే పని చేస్తున్నారు. ఈమె అక్క రేవతి సురేష్ వీ ఎఫ్ ఎక్స్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో ఆమె పని చేస్తుంది. తమిళనాడు లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వత ఫ్యాషన్ డిజైన్ చేసి నాలుగు నెలల కోర్సు ను స్కాట్లాండ్ లో చేసి వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటిగా చేయకపోయి ఉంటే ఖచ్చితంగా డిజైనింగ్ చేసే దాన్ని అని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక ఆమె అనుకున్నట్లుగానే ఇప్పుడు తన కెరియర్ను ఎంతో సాఫీగా కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుతం ఆమెకు మంచి పేరు మంచి క్రేజ్ ఉన్నా కూడా మధ్యలో కొన్ని తప్పులు చేసి తనకు వచ్చిన భారీ క్రేజ్ ను కొంత తగ్గించుకుని వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆమె కెరియర్ ను మొదట్లోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి పెద్ద తప్పు చేసింది. మహానటి చిత్రం బయోపిక్ అయినా కూడా లేడీ ఓరియెంటెడ్ అయినా కూడా దాన్ని చేసిన తర్వాత ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు చేస్తే ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉండేది అలా కాకుండా కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఫ్లాప్ అందుకుని ఇప్పుడు కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేసుకుంటూ వస్తుంది. మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.