కీర్తి సురేష్ కి తొలి తెలుగు సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలుసా?

P.Nishanth Kumar
నేను శైలజ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది కీర్తి సురేష్. మలయాళ సినిమాల ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన కీర్తి సురేష్ గీతాంజలి అనే మలయాళ చిత్రంలో నటించి హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తరువాత తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయింది ఈమె. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం నేను శైలజ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా తెలుగులో ఆమెకు డిమాండ్ పెరిగిపోయింది.

తెలుగు తమిళ మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ అన్ని భాషల ప్రేక్షకులను ఇంతకాలం అలరిస్తూ వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పవచ్చు. నేను శైలజ చిత్రం తర్వాత పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా చేసిన నేను లోకల్ చిత్రంలో నటించి వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా వచ్చిన ఇమేజ్ తో ఆమె పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి చిత్రంలో నటించి భారీ ఫ్లాప్ ను మూట కట్టుకుంది.

దానికి తోడు ఆమె నటించిన కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం భారీ ఫ్లాప్ అయ్యాయి.  అయితే అవన్నీ మహానటి సినిమా సూపర్ హిట్ కావడం తో తుడిచి పెట్టుకు పోయాయి. నేషనల్ లెవెల్ స్థాయిలో ఆమె మహానటి చిత్రంలో నటించగా ఆ సినిమా కి గాను ఆమెకు భారీ ఇమేజ్ తో పాటు నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. ప్రముఖ మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్ మరియు నటి మేనక కూతురు గా ఆమె సినిమాల్లో ప్రవేశించడానికి పెద్దగా కష్టపడకపోయినా కూడా సినిమాలలో నిలదొక్కుకోవడానికి మాత్రం చాలా కష్టపడింది అని చెప్పవచ్చు. ఆమె తండ్రి మరియు నేను శైలజ సినిమా నిర్మించిన స్రవంతి రవి కిషోర్ లు ఇద్దరు స్నేహితులు కావడంతో ఈమెకు ఆ సినిమాలో ఛాన్స్ వచ్చి నటన కూడా బాగా ఉండడంతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: