టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ విడాకులు ?

VUYYURU SUBHASH
సినిమా రంగంలో ప్రేమ‌లు, పెళ్లిల్లు, విడాకుల వ్య‌వ‌హారాలు అనేవి చాలా కామ‌న్‌. ఎంతో అన్యోన్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎప్ప‌టి వ‌ర‌కు కాపురాలు చేస్తారో ?  ఎప్పుడు విడిపోతారో చెప్ప‌లేం. నిన్న‌టి వ‌ర‌కు అన్యోన్యంగా ఉన్న దంప‌తులు కావ‌చ్చు.. లేదా ప్రేమికులు కావొచ్చు రేపు అంద‌రికి షాక్ ఇస్తూ విడిపోతూ ఉంటారు. సెల‌బ్రిటీ లైఫ్‌లో ఎవ్వ‌రూ కూడా సర్దుబాటు చేసుకోరు. ఎవ‌రికి వారే తామే గొప్ప‌.. తమ‌దే పై చేయి అన్న‌ట్టుగా ఉంటారు. ఇక్క‌డే మ‌న‌స్ప‌ర్థ‌లు వ చ్చి విడిపోతూ ఉంటారు. అయితే అలా విడిపోయిన కొన్నేళ్ల‌కు కానీ వారికి జీవిత త‌త్వం బోధ‌ప‌డి త‌మ ఆవేశానికి తాము బ‌ల‌య్యామ‌ని ప‌శ్చాత్తాప ప‌డుతూ ఉంటారు.

నాగ‌చైత‌న్య - స‌మంత జంట విడాకులే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ జంట విడిపోయి ప‌ది రోజులు అయ్యిందో లేదో ఇప్పుడు టాలీవుడ్ లో మ‌రో విడాకుల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సారి విడాకులు తీసు కోబో యేది ఓ స్టార్ డైరెక్ట‌ర్ అని టాక్ ? ఇక ఆ డైరెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే ఇండ‌స్ట్రీలో ఆయన ఓ ప్రామిసింగ్ డైరక్టర్. మాంచి హిట్ సినిమా తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇండస్ట్రీలో పనిచేసే ఓ అమ్మాచిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఒక‌టీ ఆరా సినిమా లు కూడా ఇప్పుడు చేస్తున్నాడు. ఇక సినిమా ల‌తో మాత్ర‌మే కాకుండా.. ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు స‌ద‌రు డైరెక్ట‌ర్ వైవాహిక జీవితంలో పెద్ద కుదుపు వ‌చ్చేసింద‌ని అంటున్నారు. ఆయ‌న భార్య ఇప్ప‌టికే స‌ద‌రు డైరెక్ట‌ర్ ను వ‌దిలేసి వెళ్లి పోయింద‌ని తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఆమె ఈయ‌న‌కు విడాకులు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇండ‌స్ట్రీ లైఫ్ అనేది పైకి చూడ‌డానికి ఎంత రొమాంటిక్ గా ఉంటుదో లోప‌ల అంత ఇగోలు, మ‌న‌స్ప‌ర్థ ల తో ఉంటుంద‌ని మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: