అందరూ కలిసి మోసం చేసారంటున్న ప్రకాష్ రాజ్...!

murali krishna
ఇండస్ట్రీలో జరిగే ఈ వేడుకలకు ప్రకాష్ రాజ్ అస్సలు రాడని అందరికి తెలుసు. చివరికి తాను నటించిన సినిమాల ఫంక్షన్స్ కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది..నటించడం వరకు మాత్రమే తన పని అని మిగిలింది తన పని కాదు అంటూ బయటికి వెళ్లిపోవడం ప్రకాష్ రాజ్ అంటుంటారని వార్త వినిపిస్తుంది.

సినీ పరిశ్రమలో చాలామంది ఈయనపై చేసే విమర్శలు కూడా ఇవేనని తెలుస్తుంది.అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇప్పుడు వచ్చి మా అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో నిలబడితే విమర్శలు రాకుండా ఎలా ఉంటాయి అంటున్నారట సినిమా విశ్లేషకులు. అందుకే గత కొన్ని రోజులుగా తన పద్ధతులు మార్చుకుని కొత్త మనిషిలా ప్రకాష్ రాజ్ మారిపోయాడని సమాచారం.

ఎంత వెంటబడినా కూడా అస్సలు ఇంటర్వ్యూలు ఇవ్వని ఈ మనిషి ఇప్పుడు తనకు తానుగా వచ్చి మీడియా ముందు కనిపిస్తున్నాడని తెలుస్తుంది. ఎవరు అడిగినా కూడా కాదనకుండా ఇంటర్వ్యూ ఇస్తున్నాడని సమాచారం. ఇంత మార్పు ఏంటని అడిగితే..తాను తీసుకున్న బాధ్యత అని సమాధానం చెబుతున్నాడట ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి కూడా వచ్చాడట ప్రకాష్ రాజ్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైందని తెలుస్తుంది. ఇందులో కూడా కొన్ని వ్యక్తిగత విషయాలతో పాటు మా అసోసియేషన్ విషయాలు కూడా పంచుకున్నాడని సమాచారం. తాను ఎందుకు పోటీకి నిలబడుతున్నాననే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడని తెలుస్తుంది.

ఒకప్పుడు ఈయనను తెలుగు నిర్మాతల మండలి బ్యాన్ చేసిందని ఒకరకంగా మా అసోసియేషన్ దూరం పెట్టిందని అలాగే ఎవరైతే దూరం పెట్టారో.. అదే అసోసియేషన్ కు ఇప్పుడు అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతోనే నువ్వు పోటీ చేస్తున్నారా అని అడిగాడట అలీ. మహేష్ బాబు ఆగడు (Aagadu) సినిమా సమయంలో నిర్మాతలతో ఆయనకు పెద్ద గొడవ జరిగిందని సమాచారం. అదే సమయంలో షూటింగ్ లొకేషన్ లో ఒకరిపై చేయి చేసుకున్నాడంటూ ప్రకాష్ రాజ్ పై బ్యాన్ విధించారట ఆ సినిమా నిర్మాతలు. తనను నిర్మాతలు బ్యాన్ చేసిన విషయాన్ని ఎప్పుడో మరిచిపోయానని ప్రకాష్ రాజ్ చెప్పాడని సమాచారం.

ఇక వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ..ఇంట్లో తన రాజ్యం నడవదు అంటూ సరదాగా మాట్లాడాడట ప్రకాష్ రాజ్. బయట ఎలా ఉన్నా కూడా ఇంటికి వెళితే ఆడవాళ్లు చెప్పింది నడవాలి అని ఆయన అన్నారట.వాళ్లు చెప్పినట్లు వింటానని క్లారిటీ ఇచ్చాడట ప్రకాష్ రాజ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంట్లో తను వాళ్లంతా కలిసి మోసం చేస్తారని అంటున్నట్లు సమాచారం. ఏ మాత్రం టైం దొరికినా కూడా వెంటనే కుటుంబంతో గడుపుతుంటాడట ప్రకాష్ రాజ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల కోసం ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడని తెలుస్తుంది . మరి ఈ కష్టానికి తగిన ఫలితం వస్తుందో లేదో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: